ఎంబిబిఎస్ సిటు సాధించిన విద్యార్థినికి చేయుత – రిటైర్డ్ టీచర్ శివశంకర్ ఔదార్యం
ఎంబిబిఎస్ సిటు సాధించిన విద్యార్థినికి చేయుత
- రిటైర్డ్ టీచర్ శివశంకర్ ఔదార్యం
చర్చ, జగిత్యాల : ఆ విద్యార్థిని నిరుపేద కుటుంబానికి చెందినది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన ఆదివాసి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అడబిడ్డ. చదువుపై ఆసక్తి తో ఇచ్చోడ ప్రభుత్వ వసతి గృహంలో వుంటూ తన చదువులను కొనసాగించింది. ఈ ఏట నిర్వహించిన మెడికల్ నీట్ ఎంట్రెన్స్ లో నిరుపేద విద్యార్థిని శివానంద మెడికల్ విభాగం లో సీట్ సాధించింది. వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కళాశాలలో చేరింది. సీట్ ఉచితంగానే వచ్చినా ఖర్చు లు సరిపోవడం లేదనే విషయం తెలుసుకొన్న జగిత్యాల కు చెందిన రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు సూరజ్ శివ శంకర్ నేరుగా ఆ విద్యార్థిని ఉంటున్న హాస్టల్ కు వెళ్లి తన వంతుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. తనవంతు గా మరికొంత సహాయం అందించేందుకు సిద్ధం గా వున్నానని విద్యార్థిని శివానంద కు భరోసా కల్పించారు.