చర్చ, నందతండా: అయోమయంలో నందా తండా పంచాయితీ ఓటర్లు – బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎవరు?
అయోమయంలో నందా తండా పంచాయితీ ఓటర్లు
బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎవరు?
చర్చ, నందతండా:
చుంచుపల్లి మండలం, నందతండా గ్రామ పంచాయతీకి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఎలక్షన్ ఇంచార్జి వద్దిరాజు రవిచంద్ర బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మూడ్ జయరాం కాగా మాజీ ఎమ్మెల్యే, మాజీ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జి వనమా వెంకటేశ్వరరావు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా బలపరిచిన అభ్యర్థి మాలోత్ బలరాం. మూడ్ జయరాం కి మంది ఓటు బ్యాంకు లేదనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, మలిదశ ఉద్యమకారుడిగా సమాజం లో పేరు ఉంది పైగా పార్టీ బలపరిచిన అభ్యర్థి గనుక పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేని పరిస్థితుల్లో బిఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రేగా శ్రేణులు ఉండగా, వనమా బలపరిచిన మాలోత్ బలరాం కి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ 600 పై చిలుకు ఉన్న గిరిజనేతర ఓటర్లలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఉన్నది. గడిచిన ఐదు సంవత్సరాల మాజీ సర్పంచ్ చేసిన అభివృద్ధి ఎక్కడ అని స్థానిక ప్రజలు ప్రశ్నించడంతో కంగు తిన్న వనమా శ్రేణులు. ఎవరికి ఓటు చేయాలనే అయోమయంలో స్థానిక ఓటర్లు ఉండడం అనేది పార్టీకి అవమానకరం అని, సిపిఐ, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినట్లే అని కరుడుగట్టిన బిఆర్ఎస్ ఓటర్లు చర్చించుకుంటున్నారు.