News & Views

చర్చ, నంద తండా: అవినీతి మరక లేని యువ నాయకుడు మాలోతు మురళి- కూనంనేని భరత్

 అవినీతి మరక లేని యువ నాయకుడు మాలోతు మురళి- కూనంనేని భరత్

  • తండ్రి గ్రామాన్ని నిర్మించాడు, కుమారుడు అభివృద్ధి చేసి చూపిస్తాడు – కామ్రేడ్ కటుకూరి
  • ఎమ్మెల్యే నిధులను సమీకరించైనా అభివృద్ధికి శ్రీకారం చుడత – మాలోత్ మురళి ( సర్పంచ్ అభ్యర్థి )

చర్చ, నంద తండా
చుంచుపల్లి మండలం నందతండా గ్రామపంచాయతీ కి సిపిఐ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాలోత్ మురళి ప్రచారం లో భాగంగా ఆదివారం నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడు కూనంనేని భరత్ మాట్లాడుతూ, మాలోత్ రాందాస్ మరియు కటుకూరి రామకృష్ణ కుటుంబాలు ఎమ్మెల్యే తో, సిపిఐ పార్టీ తో 50 సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నాయని, అధికారం ఉన్న లేకపోయినా పార్టీ కి అండగా ఉన్నారని, అభివృద్దే లక్ష్యం గా పార్టీ పని చేస్తుంది కాబట్టి, పార్టీ వార్డ్ మెంబెర్ గా గెలిచి సర్పంచ్ స్థాయికి ఎదిగిన మాలోత్ మురళికి మనం సహకరించాలని, బాట్ గుర్తు పై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.

అనంతరం కామ్రేడ్ కటుకూరి రామకృష్ణ మాట్లాడుతూ,
పంచాయతీ కార్యాలయం లో గ్రామ అభివృద్ధి కోసం బిఆర్ఎస్ మాజీ సర్పంచ్ మాలోత్ లక్ష్మీ పని చేసిన రోజుల కంటే సిపిఐ పార్టీ నుండి వార్డ్ మెంబెర్ గా గెలిచిన మాలోత్ మురళి పని చేసిన రోజులే ఎక్కువ అని ఎద్దేవ చేసారు.

  • నియోజకవర్గం లో సిపిఐ గెలిచిన వెంటనే మాలోత్ మురళి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారం తో రెండు డాంబర్ రోడ్లు వేయించాడు.
    విద్యానగర్ వైపుగా బైపాస్ రోడ్ వేయించాడు.
  • గ్రామం లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ఎటువంటి విబేధాలు రాకుండా సామరస్యంగా పరిష్కరించాడు.
  • చుంచుపల్లి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి ని సంప్రదించి గ్రామంలో 8 వేల రూపాయల ఖర్చు తో వీధి లైట్లు వేయించాడు.
  • పంచాయతీ కి 19 ఇందిరమ్మ ఇళ్లను తీసుకు వచ్చాడు.
  • ఏ పదవి లేకుండానే ఇటువంటి అభివృద్ధి పనులు చేసాడు.

పొత్తుల కారణం చేత ప్రతి సారి సిపిఐ పార్టీ సర్పంచ్ పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. మొదటి సారి నందతండా గ్రామ పంచాయతీ నుండి సిపిఐ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తుంది. ఒంటరిగా పోటీకి దిగిన మాలోత్ మురళి చిన్న వాడు కాదు ఎటువంటి అవినీతి మరక లేని యువ నాయకుడు. ఈ గ్రామం నిలబడటానికి కారణమైన మాలోత్ రాందాస్ వారసుడు. తండ్రి బాటలోనే, తండ్రి నిలబెట్టిన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పం తో ముందుకు వచ్చాడు.
స్థానిక ఎమ్మెల్యే మన అందరికి అందుబాటులో ఉంటారు, పంచాయతీ నిధులు సకాలంలో అందకపోయినా ఎమ్మెల్యే నిధులని పంచాయతీ అభివృద్ధి కి వినియోగించేలా కార్యాచరణ చేయగలడు.
గత సర్పంచ్ మాలోత్ హరిలాల్ ఒక్క అవకాశం ఇవ్వండి పంచాయతీ ని అభివృద్ధి పదంలో నడిపిస్తా అన్నారు, మనం అవకాశం ఇచ్చాము.
వారి అనారోగ్యం కారణం చేత వారు కాలం చెందారు.
పంచాయతీ సర్పంచ్ గా మాలోత్ లక్ష్మి ఉన్నప్పటికీ పెత్తనం ఇద్దరు కుమారుల చేతికి వెళ్ళింది.
పంచాయతీ పరిస్థితి పిచ్చి వాడి చేతిలో రాయి లాగ తయారయింది.
ఎవరి తల పగులుతుందో తెలియని పరిస్థితిలో గ్రామస్తులు ఉన్నారు. హోసింగ్ బోర్డ్ వారి స్థలాన్ని పల్లె పకృతి వనం గా ఏర్పాటు చేసారు. పట్టించుకోకపొవడం వల్ల పల్లె వనంగా మారింది.

నిధులు వారి బ్యాంకు అకౌంట్ లోకి పోయాయి, పాములన్ని మా ఇళ్లలోకి చేరాయి.
తెలంగాణ క్రీడా ప్రాంగణం అని నిధులు తీసుకున్నారు, ఇది హోసింగ్ బోర్డ్ స్థలం అని బోర్డ్ వాళ్ళు కాంపౌండ్ లు కట్టారు.
వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం రాందాస్ తండా లో 17 వేల రూపాయలు పెట్టి స్థలాన్ని కొనుగోలు చేసారు.
అదే స్థలాన్ని లక్ష యాభై వేలకు విక్రయించుకున్నారు.
హోసింగ్ బోర్డ్ వారి గ్రీన్ ల్యాండ్ లో 33 లక్షల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించారు. ఆ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి?
సిపిఐ వారు వేసిన వీధి లైట్లు మేం వేసాం అంటారు.
బంజారా హిల్స్ మేం డెవలప్ చేసాం అంటారు.
తమ్ముడు తప్పు చేసాడు అన్నగా నేను ఉద్దరిస్తాను నాకొక అవకాశం అనే రాయిని ఇవ్వండి, 5 వేలు పెట్టి కొంటాను, 5 సంవత్సరాలు తల పగలగొడతాను అంటున్నాడు.

5 వేల రూపాయలకు 5 సంవత్సరాలు మన తల తాకట్టు పెడదామా? అని ప్రశ్నించారు.
పదవిలో లేకున్నా పని చేసే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ.
అలాంటిది ఇప్పుడు మనం పదవిలో ఉన్నాం, మన పంచాయతీ ని అభివృద్ధి పదంలోనికి నడిపిద్దాం.
మీ ఓటుని మాలోత్ మురళి గుర్తు అయిన బాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని గ్రామస్థులకి పిలుపునిచ్చారు.
అనంతరం మాలోత్ మురళి మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా నిత్యం ప్రజా సేవలోనే ఉన్నాను, ఉంటున్నాను ఇకపై ఉంటాను కూడా, పంచాయతీ కార్యాలయం, రేషన్ షాప్, కమ్యూనిటీ భవనం, వీధి దీపాలు, మంచినీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీ నిధులలో జాప్యం జరిగిన ఎమ్మెల్యే నిధులను సమీకరించి అభివృద్ధి చేస్థా అని వాగ్దానం చేస్తూ, బ్యాట్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి అని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి బలపరిచిన సిపిఐ వార్డ్ మెంబర్ లు, హౌసింగ్ బోర్డ్ సెక్రటరీ మురళి రెడ్డి, సిపిఐ కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు