News & Views

చర్చ, జగిత్యాల : భాదితులకు సత్వరమే న్యాయం చేయండి – గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదు లను పరిశీలించిన ఎస్పీ

భాదితులకు సత్వరమే న్యాయం చేయండి

  • గ్రీవెన్స్ డేలో పలు ఫిర్యాదు లను పరిశీలించిన ఎస్పీ

చర్చ, జగిత్యాల : భాదితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పలువురి ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కార దిశగా కృషి చేస్తూ ప్రజలకు పోలీస్ శాఖను చెరువు చేయడమే లక్ష్యం గా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులు తీసుకొని సంభంధిత ఫిర్యాదు లపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి భాదితులకు న్యాయం జరిగేలా చూడడం జరుగుతోందని ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు.