చర్చ, జగిత్యాల: జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ప్రవీణ్
చర్చ, జగిత్యాల: భారత జాతీయ మాలల క్రైస్తవ ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. సోమవారం జగిత్యాల లో జాతీయ మాలల ఐక్య వేదిక సమావేశం అధ్యక్షులు మ్యాదరి శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర నాయకులు హాజరుకాగా ఇదే వేదికగా జాతీయ మాలల క్రైస్తవ ఐక్య వేదిక అధ్యక్షులు గా ముద్దమల్ల ప్రవీణ్ ను నియమించారు. అనంతరం మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీహరి మాట్లాడుతూ కుల సంఘాల్లో ఐక్యత లేకుంటే మనుగడ సాధించడం కష్టమన్నారు. తన నియామకానికి కృషి చేసిన మ్యాదరి శ్రీహరికి, రాష్ట్ర నాయకులకు ప్రవీణ్ ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. కుల సంఘ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తానని ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సాల్మన్ సురేందర్, ప్రసన్న కుమార్, బాబు తదితరులున్నారు.