చర్చ, పాల్వంచ: శ్యామల గోపాలన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్నిస్ పోటీలు…క్రీడలతో మరో అడుగు వేస్తున్న శ్యామల గోపాలం చైర్మన్..
శ్యామల గోపాలన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్నిస్ పోటీలు…
- క్రీడలతో మరో అడుగు వేస్తున్న శ్యామల గోపాలం చైర్మన్..
పాల్వంచ పట్టణ శ్రీనివాస్ కాలనీ మినీ స్టేడియంలో ఆదివారం శ్యామల గోపాలన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెన్నిస్ పోటీలను ప్రారంభించిన శ్యామల గోపాలన్ ట్రస్ట్ చైర్మన్ , ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్ అధినేత నల్ల సురేష్ రెడ్డి. ఈ సందర్భంగా నల్ల సురేష్ రెడ్డి మాట్లాడుతూ శ్యామల గోపాలన్ జన్మదిన వేడుకల్లో భాగంగా మా ట్రస్టు ద్వారా టెన్నిస్ పోటీలను నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా , విజయవాడ, గుంటూరు టెన్నిస్ క్రీడాకారులు పాల్గొనడం ఆనందదాయకమన్నారు. పాల్వంచ పేరు క్రీడల ద్వారా ప్రపంచంలో చూపుటకై ఆల్ ఇండియా సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ మ్యాచ్ ను పాల్వంచ లో ఏర్పాటు చేయడంలో మా ట్రస్ట్ ద్వారా నావంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఏటీపీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ టెన్నిస్ రంగంలో పాల్వంచను ప్రపంచానికి పరిచయం చేస్తానని తెలిపిన నల్ల సురేష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను క్రీడా మైదానాలకు అలవాటు చేయాలని సూచించారు. అండర్ 10,12,14 విజేతలకు బాలురుల విభాగంలో విన్నర్ విహార్ (గుంటూరు), రన్నర్ యువన్ సాయి (భద్రాద్రి) , అరిన్ (ఖమ్మం),రిషి(ఖమ్మం), రిషి ,ఆర్యన్. బాలికల విభాగంలో ప్రీతి ప్రజ్వల్ (విన్నర్)భద్రాద్రి), శాన్వి (రన్నర్)ఖమ్మం), ప్రీతి ప్రజ్వల్ (భద్రాద్రి)విన్నర్ , భాను శ్రీ (రన్నర్)భద్రాద్రి , అండర్ 14, భాను శ్రీ (భద్రాద్రి), ప్రవస్తి (రన్నర్)భద్రాద్రి నల్ల సురేష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందించడం జరిగింది. ఎంత గొప్పది కార్యక్రమాన్ని మా ఏటిపి సభ్యులకు మరియు కోచ్ డానియల్ రాంబాబు కు ధన్యవాదాలు తెలిపారు