చర్చ, పెద్దపల్లి : సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ బరిలో……

పుట్డిన ఊరిపై మమకారం ప్రతి ఒక్కరికి ఉంటుంది.అదే మమకారం కొందరిని ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేలా…మరి కొందరిని విదేశాల్లో స్థిరపడిన….
ఉన్నత విద్యావంతులు విదేశాలను వదిలేలా చేస్తుంది.
అదే కోవలో ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలు, ఇంటి నుంచి కార్యాలయానికి క్యాబ్, సదుపాయం, లక్షల్లో జీతం వంటి విలాసమంతమైన జీవితాన్ని వదిలేసి స్థానిక సమరానికి సై అంటున్నాడు ఓ యువకుడు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామానికి చెందిన ఆంగోత్ రవికుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో కి దిగి ముందుకు కదులుతున్నాడు.
ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ ఎన్ఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, పదేళ్లుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన రవి కుమార్, ఉద్యోగం వదిలి సర్పంచ్ స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశాడు.ప్రజా సేవే ద్యేయంగా తీసుకున్న యువ నాయకుడు ఇప్పుడు గ్రామ రాజకీయాల్లో నూతన శక్తిగా మారుతున్నాడు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎపిజె అబ్దుల్ కళాం ట్రస్టు ద్వారా ఇప్పటికే నిరుపేదలకు ఆర్థిక ,సామాజిక సేవతో పాటు,యువతీ,యువకులకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపాడు. తన స్వ గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా, వందశాతం అక్షరాస్యులుగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తాన్నారు. గ్రామ అబివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.ప్రజలు ఆశిర్వదిస్తే గ్రామాన్ని అభివృద్ది చేసి జిల్లాలో నే ఆదర్శంగా నిలుపుతామని రవికుమార్ పేర్కొన్నారు.