చర్చ , సత్తుపల్లి : పార్టీ నుంచి వేటు తప్పదు… రెబల్స్ పోటీ నుంచి తప్పుకోండి – ఎమ్మెల్యే మట్ట రాగమయి, డిసిసి అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్..
పార్టీ నుంచి వేటు తప్పదు…
- రెబల్స్ పోటీ నుంచి తప్పుకోండి…
- ఎమ్మెల్యే మట్ట రాగమయి, డిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్..
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి నియోజకవర్గం లోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మరియు వార్డు సభ్యులకు వ్యతిరేకంగా సొంత పార్టీ నుండి ఎవరైనా రెబల్స్ గా పోటీ చేస్తే తక్షణమే పార్టీ నుండి చర్యలు తప్పవు అని తెలిజేశారుసత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు,పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్,సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…