చర్చ, సత్తుపల్లి: బిఆర్ఎస్ పార్టీ సంబరాలు..
బిఆర్ఎస్ సంబరాలు..

చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ సాధనకు ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్ దీక్ష విజయవంతమైన డిసెంబర్ 9ను పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు విశేషంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని సత్తుపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మహేష్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధనలో కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ప్రజల పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. తెలంగాణా తల్లి కరుణ కటాక్షాలతో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.పాలాభిషేకం అనంతరం బిఆర్ఎస్ శ్రేణులు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏకతా, సంకల్ప సూచకంగా పింక్ బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేశారు.కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, టౌన్ అధ్యక్షులు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రాంతం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు జరిగాయి.