చర్చ; ములకలపల్లి: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కటిన చర్యలు – పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కటిన చర్యలు – పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్
- ఒక్కసారి ఎలక్షన్ కేసులలో ఇరుక్కుంటే వచ్చే ప్రతి ఎలక్షన్ లలో ఇబ్బందులు తప్పవు
చర్చ; ములకలపల్లి
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఎలక్షన్ కేసులలో ఇరుక్కుంటే వచ్చే ప్రతి ఎలక్షన్ లలో ఇబ్బంది పడతారని డిఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మండలంలోని జగన్నాధపురం ఐస్కూల్ లో ఎస్సై మధు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం దాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని కోరారు.
ఎలక్షన్ ప్రచారం ది,12 వ తారీఖు సాయంత్రం,5 గంటలవరకు,
ఎలక్షన్ ఉదయం,7 గంటల నుంచి మధ్యాహ్నం,1 గంటకు ముగుస్తుందని తెలిపారు. అనంతరం ఎస్సై మధు ప్రసాద్ మాట్లాడుతూ
ఎన్నికల నియమావళి లో అందరితో గౌరవంగా మెలగాలని అధికారులకు సహకరించాలిని కోరారు. అభ్యర్థులు కార్యకర్తలు ఇతరుల గురించి తప్పుగా ప్రచారం చేసినా, వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెట్టినా, అందరూ ఒక్కచోటే గుమ్మిగూడి వ్యవహారాలు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలక్షన్లు కోసం బంధువులను, దగ్గర వాల్లని చిన్న చిన్న గొడవలతో దూరం చేసుకోవద్దని కోరారు. తెలిసి తెలియని తప్పులు చేసి కేసులలో ఇరుక్కోవద్దని వివరించారు. అనంతరం ఐ స్కూల్ హెచ్ ఎం వెంకటనర్సమ్మ మాట్లాడుతూ రజికియంగా స్నేహభావంతో ఉన్న జగన్నాధపురం గ్రామస్తులు సక్రమంగా ఎన్నికలు జరుపుకోవాలన్నారు. డబ్బుకి ఎటువంటి ఇబ్బందులకు లొంగకుండా ఓటుహక్కును వినియేగించుకోవాలని కోరారు.