చర్చ, జగిత్యాల: మహిళలు స్వీయ రక్షణ పై దృష్టి సారించాలి – జే. వో. జీ. ఏ అధ్యక్షురాలు డా. పద్మిని
మహిళలు స్వీయ రక్షణ పై దృష్టి సారించాలి
జే. వో. జీ. ఏ అధ్యక్షురాలు డా. పద్మిని
చర్చ, జగిత్యాల: శాస్త సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఎంత పెరిగినా అదే స్థాయి లో మహిళలపై సాంకేతిక వేధింపులు పెరిగాయని వీటి నుంచి రక్షణ పై ప్రతి మహిళ అవగాహనా పెంచుకోవాల్సిన ఉందని జగిత్యాల అబ్ స్టేక్టీవ్ ఆండ్ గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. పద్మిని అన్నారు. మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సాంకేతిక రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అనే అంశంపై అక్కడి విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త సాంకేతిక రంగాల్లో పెరిగిన అభివృద్ధి తో ఓక కంప్యూటర్ సెల్ ఫోన్ రూపంలో అరచేతిలోకి చేరిందన్నారు. ఇలా శాస్త సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామని ఓవైపు సంతోషిస్తూ ఉంటే అదే స్థాయి లో అదే సెల్ ఫోన్ వేదికగా మహిళలపై వేధింపులు పెరిగాయన్నారు. ఇంటర్ నెట్ వేదికగా అందులోని సోషల్ మీడియా, వాట్సాప్, పేస్ బుక్, ట్విట్టర్ ల వంటి యాప్స్ ద్వారా మహిళలపై వాయి లెన్స్ పెరుగుతోందన్నారు. వాటి భారీ నుంచి మహిళలు ఎలా రక్షించు కోవాలి, వాటి భారీన పడకుండా ఎలా జాగ్రత్త లు తీసుకోవాలి, ఎలా స్వీయ నియంత్రణ పాటించాలనే అంశాలపై అవగాహనా కల్పించడమే తమ అసోసియేషన్ లక్ష్యమని డా. పద్మిని పేర్కొన్నారు.