చర్చ, చుంచుపల్లి మండలం: గోల్ పోస్టులో ఫూట్ బాల్ – నంద తండా గ్రామస్తుల ఇళ్లకు తాళాల్
గోల్ పోస్టులో ఫూట్ బాల్ – నంద తండా గ్రామస్తుల ఇళ్లకు తాళాల్
చర్చ నందా తండా
చుంచుపల్లి మండలం నందతండా గ్రామ పంచాయితీ లో రెండు బిఆర్ఎస్ వర్గాలు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఒకరు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బలపరిచిన అభ్యర్థి మూడ్ జయరాం కాగా, మరొకరు మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాలోత్ బలరాం. ఇప్పటికే బిఆర్ఎస్ ఓటర్లు ఎవరికి ఓటు చేయాలి అన్న అయోమయంలో ఉండగా, మూడ్ జయరాం ప్రచారంలో భాగంగా నందాతండా గ్రామంలో ప్రచారానికి వెళ్లగా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసుకోవడం చూసి కంగు తిన్నారు రేగా శ్రేణులు. ఫూట్ బాల్ దెబ్బకు భయపడి ఇళ్లకు తాళాలు వేసుకున్నారని బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మూడ్ జయరాం అన్నారు. మందు, మాంసం, డబ్బులు, బెదిరింపులు వంటి ప్రలోభాలకి ఓటర్లు లొంగకూడదని, చదువుకుంటే ఉంటే డిగ్రీ మాత్రమే వస్తుందని, సంస్కారం ఉంటేనే సేవ చేయగలమనే విషయాన్ని ఓటర్లు గమనించి ఫూట్ బాల్ గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా నన్ను గెలిపించండి అని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ దుండిగల్ రాజేందర్, రేగ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు.