చర్చ, కొత్తగూడెం: జిల్లా మెడికల్ వైద్యశాలలో కూడా సాధ్యం కానీ శాస్త్ర చికిత్స – విజయవంతం
జిల్లా మెడికల్ వైద్యశాలలో కూడా సాధ్యం కాని శాస్త్ర చికిత్సను
పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య సిబ్బంది

- ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాలోని నూడుల్స్ పాయింట్ లో మాస్టర్ గా పనిచేసే వెస్ట్ బెంగాల్ కు చెందిన బిశాల్ తమంగ్ 35(సం) గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం, పరిస్థితి విషమం…
- అత్యవసర చికిత్స నిమిత్తం కోసం వరంగల్ ఎంజీఎం కు వెళ్లాలని సూచించిన (GGH) జిల్లా ఆసుపత్రి వైద్యులు…
- బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సమన్వయ అధికారి డాక్టర్ జి .రవిబాబు
తక్షణమే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని చరవాణి ద్వారా ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసిన డాక్టర్ జి .రవి బాబు
ఈ విషయం తెలుసుకున్న పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి శాస్త్ర చికిత్సల విభాగం డాక్టర్లు మరియు సిబ్బంది తక్షణమే చేరుకొని రెండు గంటల శ్రమించి వ్యక్తి ప్రాణాలు కాపాడారు
ఈ యొక్క శాస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ జి .రవిబాబు (ENT) డాక్టర్ సోమరాజు దొర (జనరల్ సర్జన్) డాక్టర్ రామ్ రాంప్రసాద్ మరియు డాక్టర్ ప్రసాద్ (మత్తు వైద్య నిపుణులు) ఆపరేషన్ థియేటర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి ఐసియు కొరకు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వయంగా డాక్టర్ ప్రసాద్ గారు మరియు సహాయక సిబ్బంది నరసింహ వెళ్లి భద్రాచలం ఆసుపత్రిలో ఐసియు సురక్షితంగా అడ్మిట్ చేసిన వైద్య నారాయణ అనే నానుడిని నిరూపించిన వైద్యులు.
ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్న బిశాల తమంగు..
దిగ్విజయంగా ఆపరేషన్ పూర్తి చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడినటువంటి డి సి హెచ్ ఎస్ డాక్టర్ జి.రవిబాబు మరియు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లను.. సిబ్బందిని అభినందించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్….