News & Views

చర్చ,గోదావరిఖని: గ్రామ పంచాయితీ ఎన్నికలకు పోలీస్ శాఖ పకడ్బంది ఏర్పాట్లు..

గ్రామ పంచాయితీ ఎన్నికలకు పోలీస్ శాఖ పకడ్బంది ఏర్పాట్లు..

  • శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ..
  • రామగుండం సిపి  అంబర్ కిషోర్ ఝా వెల్లడి.

మొదటి విడత పంచాయితీ ఎన్నికల సందర్భంగా శాంతి యుత వాతావరణంలో  ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ  సిద్దంగా ఉన్నట్లు సిపి అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్‌లో మొదటి విడతగా కాల్వ శ్రీరాంపూర్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం ఐదు మండలాలలో 95 గ్రామపంచాయతీలు 685 పోలింగ్ కేంద్రాలలో, 135 పోలింగ్ లొకేషన్స్ ఉన్నట్లు తెలిపారు. మంచిర్యాల జోన్ పరిధిలో దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట నాలుగు మండలాలలో 81 గ్రామపంచాయతీలు, 514 పోలింగ్ కేంద్రాలలో,143 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయన్నారు‌.మొత్తం రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధి లో 1712 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు- 1174, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 538 ఉన్నట్లు తెలిపారు.

  • పోలింగ్ సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు, గొడవలు జరగకుండా  బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

పెద్దపల్లి జోన్ పరిధిలో  గోదావరి బ్రిడ్జి , ఎక్లాస్ పూర్, దుబ్బపల్లి ,గుంపుల వద్ద, మంచిర్యాల జోన్ పరిదిలో  పారుపల్లి ఎక్స్ రోడ్,తాండూర్ ఐబి,ఇందన్పల్లి ,గూడెం ,ఇందారం  వద్ద  చెక్ పోస్టులు ఏర్పాటు చేసి  నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల కోడ్ అమలైన రోజు నుండి  మూడు కేసులలో 6,84,910 లక్షలు సిజ్ చేసినట్లు తెలిపారు.

  • 8,57,553 విలువ 1323 లీటర్ల లిక్కర్ సీజ్ చేసి 200 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
  • 87,000 విలువగల 1750 గ్రాముల గంజాయిని సీజ్ చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
  • 30 వేల విలువగల  17 క్వింటాళ్ల  పిడిఎస్ రైస్ సిజ్  చేసి ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
  • కమిషనరేట్ పరిధిలో 357 కేసులలో 781 మందిని  బైండోవర్ చేసినట్లు తెలిపారు.

ఇద్దరిపై పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.  కమీషనరేట్  పరిధిలో 35 గన్నులకు  లైసెన్సులు ఉండగా 34  గన్స్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికల బందోబస్తు నేపథ్యంలో ఇద్దరు డీసీపీలు, ఆరుగురు ఏసీపీ లు, ముప్పైమంది సిఐలు,ఎస్ ఐ లు 95, ఏఎస్ ఐ ,హెడ్ కానిస్టేబుల్ 270, కానిస్టేబుల్  520, హోం గార్డ్స్ 240, ఏర్ సిబ్బంది 170, QRT టీమ్స్  72, మిగతా సిబ్బంది 200, సుమారు 1600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్,  సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్ పికెట్‌లు, మొబైల్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంపులుగా తిరగడం, గొడవలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడటం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకి పాల్పడటం  ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా, దైర్యంగా స్వేచ్చయుత వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు సిపి తెలిపారు.