News & Views

చర్చ,గోదావరిఖని: “పైసా వాలా” సినిమా పోస్టర్ ఆవిష్కరణ..

చర్చ,గోదావరిఖని:

“పైసా వాలా” సినిమా పోస్టర్ ఆవిష్కరణ..

ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కాబోతున్న పైసా వాలా సినిమా పోస్టర్ ను గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో హీరో ఆద్విక్ ఆద్వర్యంలో ఆవిష్కరించారు.
సినిమాలో హీరో పాత్ర పోషించిన ఆద్విక్ సింగరేణి కార్మికుడి కుమారుడు కాగా
ఆతని తండ్రి ఉపేంద్ర చారి రామగుండం ఏరియా వన్ వర్క్ షాప్ లో కార్మికునిగా పని చేస్తున్నారు.
మొదటిసారిగా నటిస్తున్న సినిమాను సింగరేణి కార్మికులతో పాటు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆదరించాలని హీరో అద్విక్ పేర్కొన్నారు.
స్నేహితుల సహకారంతో తక్కువ బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు.
పెద్ద సినిమాలకు తీసిపోకుండా పైసా వాలా సినిమాను చిత్రీకరించామని,పది రూపాయల నోటు పైన జరిగే కథ తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు వీక్షించి ఆశీర్వదించాలని కోరారు.
ఈ సినిమాకు నవీన్ తేజస్ దర్శకత్వం వహించినట్లు తెలిపారు.