News & Views

చర్చ,గోదావరిఖని: గుంజపడుగు పోలీంగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్దురాలిని ఆప్యాయంగా పలుకరించిన సిపి అంబర్ కిషోర్ ఝా…

వృద్ధురాలికి ఆప్యాయంగా పలుకరింపు..

గుంజపడుగు పోలీంగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు వచ్చిన వృద్దురాలిని ఆప్యాయంగా పలుకరించిన సిపి అంబర్ కిషోర్ ఝా…

పంచాయతీ తొలి విడత పోలింగ్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంథని మండలం గుంజపడుగులో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఓటర్ గుర్తింపు వివరాలు, వార్డ్ సమాచారం తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అక్కడున్న పోలీసు సిబ్బందిని సహాయం చేస్తారని సూచించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, భయభ్రాంతులు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.పోలీంగ్ కేంద్రాల పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు .