News & Views

చర్చ, జగిత్యాల: నిధుల మంజూరికి కృషి చేసిన ఎంపీ అర్వింద్

  1. నిధుల మంజూరికి కృషి చేసిన ఎంపీ అర్వింద్
  • కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

చర్చ, జగిత్యాల :జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని వివిధ బ్రిడ్జిలు నిర్మాణం కోసం నిధులిప్పించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గతంలోనే ఎంపీ అర్వింద్ కుమార్ ను కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే విన్నపాన్ని గుర్తుంచుకొన్న నిజామాబాద్ ఎంపీ అర్వింద్ గత రెండు రోజుల క్రితం కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎంపీ అర్వింద్ అవసరాన్ని వివరించడంతో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని అంతర్గాం, అంబరిపేట ల మధ్య ఫ్లై ఒవేర్, అండర్ పాస్ నిర్మాణం, ఆనంతారం వద్ద హై లెవల్ వంతెన, చల్ గల్, సింగరావుపేట, ఇటిక్యాల గ్రామాల మధ్యలో హైలెవల్ బ్రిడ్జి, బోర్నపెల్లి, జగన్నాథ్ పూర్ మధ్య హైలెవల్ వంతెన నిర్మాణం కోసం జగిత్యాల లో ఇటీవలే జరిగిన దిశ మీటింగ్ లో ఎంపీ అర్వింద్ ను కోరడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన విన్నపాన్ని పరిశీలించిన ఎంపీ రెండు రోజుల క్రితం కేంద్ర రోడ్లు భవనాల మంత్రి నితిన్ గడ్కరిని కోరడమైనదని దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన విన్నపాన్ని మన్నించి నిధుల మంజూరు కు కృషి చేసిన ఎంపీ అర్వింద్ కు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.