News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం: పంచాయతీ ఎన్నికల మొదటి దఫా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

పంచాయతీ ఎన్నికల మొదటి దఫా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం

గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ నకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను తెలుసుకుంటూ ఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.అశ్వాపురం మండలం ఆనందపురం,మణుగూరు మండలం సమితి సింగారం,బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి,బిపిఎల్ పాఠశాల,సారపాక మజీద్ రోడ్డు ప్రభుత్వ పాఠశాల అనంతరం భద్రాచలం పంచాయతీలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల,నన్నపునేని మోహన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదలగు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ విధులలో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు.మొదటి దఫా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు,సిబ్బంది సమర్థవంతంగా తమ విధులను నిర్వర్తించడం జరుగుతుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలిపారు.