News & Views

చర్చ, జగిత్యాల : తల్లిపై కూతురు గెలుపు – సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన

తల్లిపై కూతురు గెలుపు

  • సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాల్లో ఆసక్తికర సంఘటనలు వెలుగుచుస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం లోని తిమ్మయ్య పల్లె గ్రామంలో ముందే ఆసక్తి కర పోటీ నెలకొంది. పంచాయతీ ఎన్నికల బరిలో ఓకే తల్లి కూతుర్లు సర్పంచ్ అభ్యర్థులు గా బరిలో ఉండడమే ఆసక్తి ని పెంచింది. నామినేషన్ల విత్ డ్రా వరకు అమ్మా తప్పుకోవే అంటూ కూతురు తల్లిని అభ్యర్థించ్చినట్లు తగ్గేదేలే అన్న స్టైల్లో తల్లి సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గురువారం తిమ్మయ్య పల్లె గ్రామం మొదటి విడతలో ఎన్నిక జరుగగా తుది ఫలితాల్లో కన్న తల్లిపైనే స్వంత కూతురు గెలిచి జగిత్యాల జిల్లా లోనే చర్చనియాంశంగా మారింది. తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమ 91 ఓట్లతో గెలుపొంది చర్చనీయాంశంగా మారింది.