చర్చ,గోదావరిఖని: ఆయన కండ్లు.. ఇద్దరికి వెలుగులు..
ఆయన కండ్లు.. ఇద్దరికి వెలుగులు..
- నేత్రదాత సత్యనారాయణకు ఘనంగా నివాళులు..
గోదావరిఖని కళ్యాణ్ నగర్ కు చెందిన గుల్బం సత్యనారాయణ(67) గత నెల 30న మృతి చెందారు. విషాదంలో కూడా వారి కుటుంబ సభ్యులు మృతుని నేత్రాలను దానం చేసి స్పూర్తిగా నిలిచారు. గురువారం నేత్రదాత సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేత్రదాత కుటుంబ సభ్యులను లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు మామిడి శ్రీధర్, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కే ఎస్ వాసు నేత్రదాన అభినందన పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానంపై అపోహలు, అనుమానాలు వీడాలని అన్నారు.మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మరణించిన వ్యక్తి నేత్రాలను నిప్పుకో, మట్టికో అర్పించడంకంటే… ఆ నేత్రాలను దానం చేస్తే, చీకట్లో మగ్గుతున్న ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నేత్రదాత కుమారులు సతీష్, రమేష్, సురేష్, నరేష్ తోపాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు పాల్గొన్నారు.