News & Views

చర్చ,గోదావరిఖని: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలి.

చర్చ,గోదావరిఖని:

నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా చేపట్టాలి.
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో నూతనంగా ప్రవేశపెట్టిన రెండు షిప్టుల పారిశుద్ద్య నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ పేర్కొన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయoలో గురువారం పారిశుద్ధ్య విభాగం సూపర్ వైజర్లు, సిబ్బంది , వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ అదనంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్నం షిఫ్ట్ లో పారిశుద్ధ్య సిబ్బందితో పూర్తి స్థాయిలో పనులు చేయించాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హాజరు, పని తీరు వార్డు అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన డివిజన్ లోనే పని చేయాలని సూచించారు. ప్రతి స్వచ్చ ఆటో తప్పనిసరిగా డి ఆర్ సి , కంపోస్ట్ యార్డ్ కు వెళ్లాలని అన్నారు. అన్ని వాహనాలు రన్నింగ్ కండిషన్ లో ఉండేలా చూసుకోవాలని అన్నారు. సేకరించిన చెత్త బరువు తూకం వేసి రికార్డుల్లో నమోదు చేసేందుకు మరో రెండు వేయింగ్ యంత్రాలను తెప్పించాలని అదికారులను ఆదేశించారు. ఈ సమావేశoలో అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , ఎస్ ఇ గురువీర , ఇ ఇ రామన్ , డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు , ఆర్ ఓ ఆంజనేయులు , డి ఇ శాంతి స్వరూప్ , ఎ ఇ జమీల్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ లు నాగ భూషణం , సంపత్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీపాల్ , ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.