News & Views

చర్చ ముందుగానే చెప్పింది… కాకులమర్రి శ్రీలత విజయం లాంఛనమే అని…! ఓటింగ్ ఏకపక్షమేనని…!

చర్చ ముందుగానే చెప్పింది… కాకులమర్రి శ్రీలత విజయం లాంఛనమే అని…! ఓటింగ్ ఏకపక్షమేనని…!

 

  • పరిశోధనాత్మక జర్నలిజం మా నైజం…
    నిజాలనిగ్గు తేల్చడమే మా ఇజం…

ములుగు జిల్లా ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ ఓటర్లు వారి మద్దతు కాకుల మర్రికే ఇచ్చారు…
వార్డు మెంబర్ల లెక్కింపు నుండే
వారు బలపరిచిన అభ్యర్థులు ముందంజలో కొనసాగగా, చివరిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు నాలుగు వార్డుల్లో గెలిచారు. ఏటూరు నాగారం
పంచాయతీలో 16 వార్డులు ఉండగా 12 స్థానాలు బి ఆర్ ఎస్ వే…

ఏటూరు నాగారం పంచాయతీ పరిధిలో 12వేల ఓట్లు ఉండగా, 70% పోలింగ్ జరిగింది.

సర్పంచ్ అభ్యర్థి కాకుల మర్రి శ్రీలత 3,230 ఓట్లతో భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరవేశారు..
ఈ సందర్భంగా కాకులమర్రి దంపతులు మాట్లాడుతూ గ్రామ ప్రజలు మాపై మరింత బాధ్యతను పెంచారని, మాపై నమ్మకం ఉంచి మా వైపే నిలబడ్డారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఏటూర్ నాగారం గ్రామపంచాయతీ లో అవినీతిరహిత పాలనను అందిస్తామని, అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా తోడుగా నిలబడతామని అన్నారు. గెలుపుకు అహర్నిశలు శ్రమించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.