చర్చ, కరీంనగర్: ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్ట్ సబ్ స్టేషన్ పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో లిఫ్ట్ సబ్ స్టేషన్ పరిశీలించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలోని గోదావరివద్ద ఉన్న లిఫ్ట్‌కు సంబంధించిన సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లోని కాపర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటనపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్పందించారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి గారు రాయపట్నం లిఫ్ట్ ప్రాంతాన్ని స్థానిక మండల నాయకులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.
తరువాత సంబంధిత అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ గారితో ఫోన్ ద్వారా సంప్రదించి, దొంగిలించిన కాపర్ స్థానంలో కొత్త సామగ్రి ఏర్పాటు కోసం అవసరమైన నిధులను వారం రోజుల్లోపే విడుదల చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.