చర్చ,గోదావరిఖని: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి – పెద్దపల్లి డిసిపి బి. రామ్ రెడ్డి
రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం అంతర్గాం మండలంలో పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి గోదావరిఖని ఏసిపి ఏం రమేష్ తో కలిసి ముర్మూర్, ఎల్లంపల్లి, గోలివాడ గ్రామాలను సందర్శించారు. ప్రజలు, గ్రామ పెద్దలు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమని, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా అందరూ సమన్వయం పాటించాలన్నారు. గ్రామాల్లో ఏదైనా ఘర్షణ వాతావరణం ఉంటే పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు గౌరవించి పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతాయని అన్నారు.ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సూచనలు పాటించాలని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు ,సమావేశాలకు అనుమతి లేదన్నారు. పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు,ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, అంతర్గాo ఏస్సై వెంకట్ తదితరులు పాల్గొన్నారు.