చర్చ,గోదావరిఖని: యూరియా కొరత రాకుండ చూడండి.. కేంద్రానికి లేఖ రాసిన పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ.
చర్చ,గోదావరిఖని:
యూరియా కొరత రాకుండ చూడండి..
- కేంద్రానికి లేఖ రాసిన పెద్దపల్లి ఎంపి వంశీకృష్ణ.
రాబోయే సాగు సీజన్ లో రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలని అవసరమైన యూరియా రవాణా మరియు ఉత్పత్తి అంశాలపై శుక్రవారం కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొన్న ఎరువుల కొరత, సరఫరా లోపాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణలో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి ,మంత్రి వివేక్ కీలక పాత్ర పోషించిన విషయాన్ని లేఖ ద్వార గుర్తుచేశారు. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో నేరుగా మాట్లాడి సుమారు 10 వేల కోట్లు రుణమాఫీ చేయించి నట్లు పేర్కొన్నారు.
రామగుండం ఎరువుల కర్మాగారంలో సంవత్సరానికి 13 లక్షల టన్నులు యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి చేస్తుందని ఆరోపించారు. ఆర్ ఎఫ్ సి ఎల్ యూరియా ఉత్పత్తి లో నిర్లక్ష్యగా వ్యవహరిస్తుందన్నారు.
నోయిడాలో ఉన్న ఆర్ఎఫ్ సిఎల్ కేంద్ర కార్యాలయాన్ని రామగుండానికి మార్చాలని ఇప్పటికే పలు లేఖలు రాసి డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎరువుల మంత్రికి ప్రశ్నలు లేవనెత్తినట్లు వివరించారు.
ప్లాంట్ తరచూ షట్డౌన్లు, రిపేర్లు, సాంకేతిక సమస్యలు ఎదుర్కొవడం వల్ల ఉత్పత్తి కి విఘాతం కలుగుతుందని అన్నారు. సమస్యలను పరిష్కరించి ప్లాంట్ లో నిరంతరం యూరియా ఉత్పత్తి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.