చర్చ,గోదావరిఖని: స్మైల్ ప్రాజెక్టు ఆద్వర్యంలో యాచకులకు పునారావాసం…
చర్చ,గోదావరిఖని: స్మైల్ ప్రాజెక్టు ఆద్వర్యంలో యాచకులకు పునారావాసం…
బిక్షాటన లేని నగరం గా రామగుండం ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె. అరుణ శ్రీ కోరారు . స్మైల్ ప్రాజెక్ట్ ( సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లిహుడ్ ఎంటర్ ప్రైజెస్ ) నిర్వాహక సంస్థ శ్రీ వినాయక విమెన్ ( అర్బన్ ) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటి ఆద్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర సామాజిక న్యాయ ,సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్ లో భాగంగా యాచక వృత్తిలో ఉన్న వారిని గుర్తించి పునరావాసం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. రామగుండం నగర పాలక సంస్థ మెప్మా ఆద్వర్యంలో గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్ లో స్మైల్ ప్రాజెక్ట్ పునారావాస కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఉచిత వసతి , మూడు పూటలా ఉచిత భోజనం కల్పించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి ఉన్న వారికి వివిధ అంశాలలో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉపాధి కూడా కల్పించడం జరుగుతున్నదని అన్నారు. వికలాంగులు , అనాధలు, నిరాదరణకు గురైన వారు యాచక వృత్తిలో ఉన్నట్లు గమనిస్తే నేరుగా పునరావాస కేంద్రం లో చేర్పించడం , వీలు కాని పక్షంలో కేంద్ర నిర్వాహకుల ఫోన్ నెంబర్లు : 7013584588 , 8639717597 కు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ , సెక్రెటరీ ఉమా మహేశ్వర్ రావు, మెప్మా టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక , కమ్యూనిటి ఆర్గనైజర్ ఊర్మిళ , రామగుండం పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు , స్మైల్ పునరావాస కేంద్ర నిర్వాహకురాలు నూనె లతా మోహన్ , నిర్వాహకులు శరత్ మోహన్ , మమత తదితరులు పాల్గొన్నారు.