News & Views

చర్చ,పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.

చర్చ,పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం.

  • బోల్తాపడిన బొలెరో వాహనం
  • వలస కూలీలకు గాయాలు…

సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద రాజీవ్ రహదారిపై బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.చంద్రపూర్ నుండి సుల్తానాబాద్ కు పొలం పనుల కోసం కూలీలతో వస్తున్న బొరెరో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది.
వాహనంలో ప్రయాణిస్తున్న15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.