చర్చ, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషిచేయండి ఆన్లైన్ సేవాదల్ సభ్యత్వాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి
చర్చ, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషిచేయండి
- ఆన్లైన్ సేవాదల్ సభ్యత్వాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి_
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం టిపిసిసి సేవాదళ్ సెక్రెటరీ బోగోజి ముఖేష్ కన్నా ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ సేవాదళ్ ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి,డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ ఆర్గనైజేషన్ చాలా కీలకమైనదన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పార్టీ కార్యక్రమాలను క్రింది స్థాయి వరకు తీసుకెళ్లేది కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలేనని అన్నారు. సేవాదళ్ సభ్యత్వం లో కార్యకర్తలు ముందుండాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా సేవా సేవాదళ్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపిచ్చారు. అనంతరం డిసిసి అధ్యక్షులు నందయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్ట పడే వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సేవాదల్ విభాగం కాంగ్రెస్ పార్టీకి కీ లేకమైందన్నారు. యువతను సేవాదల్ విభాగం లో పెద్ద ఎత్తున చేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్
తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ కల్లేపల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్ నాయకులు దేవనపల్లి రాజేందర్, నాగభూషణం, మహేందర్, వినయ్, రాకేష్, ప్రమోద్ తదితరులున్నారు.