News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు

పాల్వంచ మండలంలో రేపు, అంటే 14వ తేదీన జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పాల్వంచ పట్టణంలోని బొల్లొరిగూడెం హై స్కూల్‌లో ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ బాక్సులను పోలింగ్ బూత్ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఆర్డీవో మధు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మరియు ఆర్డీవో మధు మాట్లాడుతూ… గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. పాల్వంచ మండలంలోని 36 గ్రామపంచాయతీలను 5 జోన్‌లుగా విభజించారు.
పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ ఆఫీసర్లు (POలు): 254 మంది
అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు (APOలు): 254 మంది
మొత్తం సిబ్బంది: 508 మంది
పోలింగ్ కేంద్రాల నిర్వహణ కోసం ఈ 508 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. 16 రూట్ల వారీగా రూట్ ఆఫీసర్‌లను, 5 జోన్ ఆఫీసర్‌లను నియమించారు.
డిస్ట్రిబ్యూషన్ (సామగ్రి పంపిణీ) ఉదయం 8 గంటలకే ప్రారంభించబడింది. ఎటువంటి లోటుపాట్లు లేకుండా మండల పరిషత్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. మండలంలో 14 లోకేషన్లలో 148 పోలింగ్ కేంద్రాలను (పీఎస్‌లు) హైపర్‌సెన్సిటివ్గా గుర్తించారు. 10 లోకేషన్లలో 86 పోలింగ్ కేంద్రాలను నార్మల్‌గా గుర్తించారు. 7 లోకేషన్లలో 54 పోలింగ్ కేంద్రాలను సెన్సిటివ్‌గా గుర్తించారు. గుర్తించిన వర్గీకరణకు తగ్గట్టుగా తగిన బందోబస్తు కూడా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు సజావుగా పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.