చర్చ,పెద్దపల్లి పెద్దపల్లి జిల్లాలో రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధం.
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో రెండో విడత లో బాగంగా 4 మండలాల్లో పాలకుర్తి, అంతర్ఘం, ధర్మారం, జూలపల్లి మండలాల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 73 గ్రామ పంచాయతీకు గాను 3 ఏక గ్రీవం కాగా 70 గ్రామపంచాయతులకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 286 మంది బరి లో ఉన్నారు. అలాగే మొత్తం 684 వార్డులకు గాను 177 ఏకగ్రీవం కాగా 507 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1417 మంది బరి లో ఉన్నారు. పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు పంపించారు అధికారులు. ఏర్పాట్ల ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ప్రశాంత వాతావరణం పోలింగ్ జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNS సెక్షన్ అమలు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన గొడవలు చేసిన ఎన్నికల నియమావళి అతిక్రమించిన చర్యలు తప్పవని సిపి పేర్కొన్నారు.