చర్చ, కరీంనగర్: నేను పాలకుడిని కాదు ప్రజాసేవకునిగా మీ ముందుకు వస్తున్నాను సర్పంచ్ గా గెలించండి
సర్పంచ్ గా పోటీచేస్తున్నా వెలిశేట్టీ జ్యోతి కిషోర్ హామీ..

నేను పాలకుడిని కాదు ప్రజాసేవకునిగా మీ ముందుకు వస్తున్నాను.ఈ సారీ సర్పంచ్ గా గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నాను. తాను గత రెండు మార్లు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినా కూడా ప్రజాసేవను మరవలేదు.గ్రామంలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తూ మీ ముందుకు వస్తున్నాను.ఈ సారీ గెలిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలపై నా తనువు ఉన్నంతవరకు పోరాడి వాటి పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను.గతంలో రెండు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి డిపోయాను అయినా కూడా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నాను.ఈ సారీ తనను సర్పంచ్ గా గెలిపించి గ్రామాభివృద్ధికి, ప్రజాభివృద్ధికి తోడ్పాడాలని కోరుతున్నాను.గతంలో ఊటూరి గ్రామాభివృద్ధికి తన శక్తి వంచనా లేకుండా కృషిచేశానన్నారు. తనను ఈ సారీ గెలిపిస్తే ఊటూరు గ్రామం చుట్టు పక్కల గ్రామాలకు రవాణ రాకపోకలు సాగేందుకు రహదారులను మరమ్మతులు చేస్తానని ఇంటర్ రోడ్లు వేయించి ప్రజల రాకపోకలను మెరుగుపరుస్తానని హామి ఇచ్తారు.అలాగే S C. కాలనీ లోని స్మశాన వాటిక. C. C రోడ్డు, కుల సంఘాలకు కమ్యూనీటి భవనాలు నిర్మించడంతో ప్రజల అవసరాలను తీరుస్తానని ఆమే హామీఇచ్చారు.
గ్రామంలో కోతులు లేకుండా చేసి ప్రజలకు రక్షణ కల్పిస్తానని హామి ఇచ్చారు.
ఊటూరు గ్రామంలో వైకుంఠ రథం ఏర్పాటు చేయడం ఫ్రీజర్ సౌకర్య ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చారు.
ఊటూరు గ్రామ నలువైపులా రోడ్డు వేయడంతో పాటు
గవర్నమెంట్ తెలుగు మీడియం పాఠశాలను ఇంగ్లీష్ మీడియం మోడల్ పాఠశాలగ ఆధునీకరిస్తానన్నారు
పల్లె దవాఖాన లో ప్రతి రోజు డాక్టర్ అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలందించే విదంగా కృషి చేస్తానన్నారు.
అవినీతి రహిత గ్రామ పంచాయతిగా మారుస్తానన్నారు. తీర్చిదిద్దుతానన్నారు.
వంద శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేస్తానన్నారు.ఊటూరు గ్రామంలోనలైబ్రరీ
ప్రతి రోజు నల్లా నీటి సరఫరా అయ్యే విదంగా చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.ఊటూర్ గ్రామంలో పెండింగ్‌లో ఉన్నా అభివృద్ధి పనులను పూర్తి చేయించి గ్రామాభివృద్ధికి తన వంతు కృషి నందిస్తానన్నారు.
వెలి శెట్టి జ్యోత్ కిషోర్ కు అడుగడున ప్రజల నీరాజనాలు..
ఊటూరు గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్నా వెలిశేట్టి జ్యోతి కిషార్ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడ చూసిన ప్రజలు స్వాగతం పలుకు తున్నారు.