చర్చ, పెద్దపల్లి: జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన “కృష్ణవేణి” కుసుమాలు
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన “కృష్ణవేణి” కుసుమాలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల నందన గార్డెన్స్ లో జరిగిన వేదిక్ మ్యాథ్స్ మరియు అబాకస్ జిల్లాస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వేదిక్ మ్యాథ్స్ లో ప్రథమ స్థానం లో 8వ తరగతి చదువుతున్న సాగర్ల. రమ్య , అబాకస్ లో ప్రథమ స్థానంలో 5వ తరగతి చదువుతున్న బిరుక శ్రీవాణి, ద్వితీయ స్థానంలో 4వ తరగతి చదువుతున్న శాన్వి శ్రీ లతో పాటు కాన్సోలేషన్ విభాగంలో రియా అర్బా, సాయి వర్షిణి, రిషి, రంజిత్ కుమార్, తేజ శ్రీ, లోహిత లు బహుమతులు పొందారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఈ విజయం సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, వారి విజయం నకు కారణమైన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.