News & Views

చర్చ, సత్తుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర….

చర్చ, సత్తుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర….

తల్లాడ మండలం మల్లారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. సండ్ర మాట్లాడుతూ అభివృద్ధి, ప్రశాంతత కోసం బిఆర్ఎస్, టిడిపి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కటికి నరసింహారావును గెలిపించాలని కోరారు. మల్లారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్, టిడిపి పార్టీలు సర్పంచ్, వార్డుల అభ్యర్థులను గెలిపించి మల్లారం గ్రామ పంచాయతీ ప్రతిష్ఠను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా తాను తల్లాడ నుంచి మల్లారం మీదుగా గంగదేవిపాడు వరకు తారురోడ్డు నిర్మాణం, మల్లారం ను బాలపేట రోడ్డు మరమ్మతులు, రైతువేదిక, అంబేద్కర్-పూలే ఎస్సీ కమ్యూనిటీ హాలు, గ్రామ పంచాయితీలో 90శాతం అంతర్గత సిసి రోడ్లు నిర్మించడం, తాగునీరు, సాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన విషయం ఎంపిటిసి సభ్యురాలు కటికి భారతమ్మ గారితోపాటు మల్లారం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.