News & Views

చర్చ, రామగిరి: విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్స్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలి

 

  • 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
  • ఐక్య విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ ఈశ్వర్ రావు

తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేసే ఆర్టిజన్స్ అందరిని పర్మినెంట్ చేసి, విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేసి విద్యుత్ ఉద్యోగుల హక్కులను హరించే 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సంయుక్త విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రావు అన్నారు.ఆదివారం రామగిరి మండలం లోని సాయిరాం గార్డెన్ లో సిఐటియు పెద్దపల్లి సర్కిల్,సంయుక్త విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్  వాగు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలోని విద్యుత్ కళాకారులను (ఆర్టిజన్స్) అందరిని పర్మినెంట్ చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేసి విద్యుత్ ఉద్యోగుల హక్కులను హరించే 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సర్కిల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ పనులు కూడా ఆపరేటర్స్ తో చేయించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని ఈ విధమైన పద్ధతి రాష్ట్రంలో ఎక్కడా లేదని జిల్లా అధికార యంత్రాంగం ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలని లేదంటే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ సిఐటియు జాతీయ మహాసభలు డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ఇందులో కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను అడ్డుకోవడం శ్రమ శక్తి నీతి 2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో స్వతంత్ర ఐక్య కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని నిరంతరం కార్మిక వర్గ శ్రేయస్సు కోసం పోరాడుతున్న సిఐటియు అఖిలభారత మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎన్ బిక్షపతి యూనియన్ పెద్దపల్లి సర్కిల్ ప్రధాన కార్యదర్శి నరసయ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి మట్టరాజు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.