News & Views

చర్చ, సత్తుపల్లి: రేగళ్ళపాడు వద్ద రోడ్ ప్రమాదం… యువకుడికి తీవ్ర గాయాలు…

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామము సమీపంలో రెండు బైకులు వేగంగా గుద్దుకుని యాక్సిడెంట్అయింది.అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్కపురి లోకేష్ (24).అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇలాసారపు పవన్ (23). స్కూటీ మీద సత్తుపల్లి వెళుతుండగావెనకవైపు నుంచి మరొక బైక్ వచ్చి అతివేగంగా ఢీకొని వెళ్లిపోయింది.సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 సిబ్బంది(ఇఎంటి) ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గొల్లమందల కృష్ణ వాహన చోదకుడు పైలెట్ ఏకాంత్ హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలోనే విరిగిపోయిన ఎడమకాలుకి వైద్యం అందించి అంబులెన్స్ లో ఎక్కించుకొని ఆధునిక వైద్య విధానములో మెడపట్టి (సి కొల్లార్), స్ప్లింటింగ్, ఆక్సిజన్ సెలైన్ బాటిల్స్ తో చికిత్స అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించిన సత్తుపల్లి 108 సిబ్బందిని ఖమ్మం జిల్లా 108 సర్వీస్ మేనేజర్ అవులూరి దుర్గాప్రసాద్ ,మూడు జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పాటి. శివకుమార్, రేగళ్లపాడు గ్రామస్తులు వాహనదారులు అభినందించారు