చర్చ, ఏటూరు నాగారం: మాస్ కాపీయింగ్ మాఫియాలో ఎటూర్ నాగారం జవహర్ నవోదయ పరీక్షా కేంద్రం?
అర్హులైన పేద పిల్లలకు సీటు దక్కకుండా చేస్తున్న కాపీయింగ్ ముఠా
13 వ తారీకున జరిగిన జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరవ తరగతి ప్రవేశ0 కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలలో పెద్ద ఎత్తున కాపీయింగ్ కుంభకోణం వెలుగు చూసింది. పరీక్షకేంద్రం లో పలుకుబడి ఉన్న వ్యక్తుల పిల్లలకు మేలు చేకూరేలా వ్యవహరించిన వైనం అందరిని పులికి పడిన చేసింది. పరీక్ష కేంద్రానికి సంబంధించిన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ డి ఓ, సి సి గా వ్యవహరించిన వ్యక్తులు ఈ కాపీయింగ్ వ్యవహారంలో క్రియాశీలకంగా చక్రం తిప్పినట్టు సమాచారం. మరికొందరు ఇన్విజిలేటర్లు గా వ్యవహరించిన ఉపాధ్యాయులు ఆర్థికంగా ఉన్న తల్లిదండ్రులతో, వారికి దగ్గరిగా ఉన్న స్నేహితులైన ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున ఆర్థిక మొత్తం తీసుకొని అంతర్గత రహస్య ఒప్పందాలతో పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ వ్యవహారం నడిపినట్లు సమాచారం. ఈ కాపీయింగ్ మాఫియా వలన అర్హులైన పేద విద్యార్థులకు న్యాయంగా దక్కాల్సిన నవోదయ సీట్లు కోల్పోతున్నామని కొద్దిమంది తల్లిదండ్రులు వాపోయారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపి, పెద్ద ఎత్తున కాపీయింగ్ అక్రమాలకు పాల్పడిన, సహకరించిన జవహర్ నవోదయ ఏటూరు నాగారం పరీక్షల అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా మళ్లీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.