చర్చ, జగిత్యాల : చేసిన అభివృద్ధిని చూసే ఆదరిస్తున్నారు – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
రాభోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమే
చేసిన అభివృద్ధిని చూసే ఆదరిస్తున్నారు – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
చర్చ, జగిత్యాల : గత బి. ఆర్. ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు అదరిస్తున్నారని గత రెండేండ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమిలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా గొల్లపల్లి మండల కేంద్రం లో కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చిందన్నారు. గత రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపు నిచ్చారు. బి. ఆర్. ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆవుల జమున సత్యం లను ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు నిచ్చారు.