

చర్చ : అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 42 % రిజర్వేషన్స్ అమలు చేయాలి- జారే.
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ 42 % కోసం జేఏసీ అశ్వర్యంలో బంద్ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉదయం నుండే షాపులు మూసివేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కూడా బందులో పాల్గొని రిజర్వేషన్ ప్రక్రియ అమలు చెయ్యాలని మద్ధతు తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలు పార్టీలు పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుండే బీసీ జేఏసీ బంద్ పిలుపుకు వ్యాపార సంఘాలు అన్ని సహకరించడంతో రోడ్లన్నీ నిర్మా నిమిషంగా ఉన్నాయి. ఏటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.