News & Views

చర్చ,పెద్దపల్లి: స్వేచ్ఛాయుత పోలింగ్‌కు ప్రజల సహకరించాలి – పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి వెల్లడి.

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి రూరల్ పరిధిలోని రాఘవాపూర్, అప్పన్నపేట, పెద్ద కల్వల, సుల్తానాబాద్ మండలం, ఎలిగేడు మరియు పోత్కపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించి, పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో మాట్లాడి శాంతి యుత వాతావరణంలొ ఎన్నికలు జరుపుకోవాలని కోరారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకారించాలని ప్రజాప్రతినిధి లు, ప్రజలను కోరారు. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్, ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, గొడవలు సృష్టించడం , ఓటర్లను భయపెట్టడం, ప్రభావితం చేయడం లేదా ఓటు హక్కును అడ్డుకోవడం నేరమని అలాంటి చర్యలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ శ్రీ జి. కృష్ణ, సీఐ శ్రీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.