చర్చ,రామగిరి: నూతన సర్పంచులు ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించండి అర్జీ 3,జిఎం సుధాకర్ రావు
నూతన సర్పంచులు ప్రజాభిప్రాయ సేకరణకు సహకరించండి
- అర్జీ 3,జిఎం సుధాకర్ రావు
ప్రజాభిప్రాయ సేకరణకు పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని రామగుండం -3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు అన్నారు.
సోమవారం జిఎం కార్యాలయంలో నూతనంగా ఎన్నుకోబడ్డ పరిసర ప్రాంతాల గ్రామ సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 19న స్థానిక జేఎన్టీయూహెచ్ మంథని కళాశాల క్రీడా మైదానం నందు రామగుండం కోల్ మైన్ పై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని, కావున పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ప్రజాభిప్రాయ సేకరణకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
కార్యక్రమంలో పరిసర ప్రాంత గ్రామ సర్పంచులు వనిత సాయికుమార్, చిందం మహేష్, పల్లె ప్రతిమ పివి రావు, రజిత సుధాకర్, వనం రామచంద్ర రావు, భాగ్యలక్ష్మి కొమురయ్య, సురేష్ , ఎస్ఓటుజిఎం యం.రామ్మోహన్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, అధికారులు బి.వి.సత్యనారాయణ, బి.టి. మురళీకృష్ణ, సుదర్శనం, ఐలయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.