News & Views

చర్చ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే రాగమయి విస్తృత ప్రచారం…..

సత్తుపల్లి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గంగారం, కొత్తూరు, గౌరు గూడెం, సిద్ధారం, సదా శివుని పేట, పాకల గూడెం గ్రామా పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మట్ట రాగమయి పాల్గొని విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్ట రాగమయి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయా పంచాయతీ గ్రామ ప్రజలను ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అనేక అభివృద్ధి పథకాలు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ అనేక అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీర్వచనాలతో సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు అనేక అభివృద్ధి పొలాలు అందుతున్నాయని, రానున్న కాలంలో సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామ గ్రామాన అనేక అభివృద్ధి ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే మట్ట రాఘమయి ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. మీ అమూల్యమైన ఓట్లు కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లకు వారి వారి గుర్తులపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, మహిళా సంఘం నాయకులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.