చర్చ,గోదావరిఖని: ఎమ్మెల్యే బస్తీబాట.. సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజల వద్దకు..
ఎమ్మెల్యే బస్తీబాట..
సమస్యల పరిష్కారం కోసం నేరుగా ప్రజల వద్దకు..
మార్నింగ్ వాక్ లో పలు డివిజన్లలో పర్యటించిన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్..
రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలోని పలు డివిజన్లలో మంగళవారం తెల్లవారుజామున ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పర్యటించారు.ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని సిక్కు వాడ, లక్ష్మీ నగర్, కళ్యాణ్ నగర్ పరిసర ప్రాంతాలలో బైక్ పై తిరుగుతూ ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు ఉంటే నేరుగా సంప్రదించాలని అన్నారు. డివిజన్లలో ఉన్న పలు సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఇల్లు లేని వారికి ఇంటి సదుపాయాన్ని కల్పించడంతోపాటు ఆయా ప్రాంతాలలో డ్రైనేజీ, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, మంచినీటికి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. డివిజన్ స్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు.వారి వెంట కాంగ్రెస్ నాయకులు కాల్వ లింగస్వామి,రవికుమార్,ముస్తఫా తదితరులు ఉన్నారు.
MLA Basti Bata. Directly to the people for solving problems..