News & Views

చర్చ:కమాన్ పూర్: మంథని మార్కెట్ వ్యాపారస్తులకు హైకోర్టు లో ఊరట

తరలింపు, కూల్చివేతలు నిలిపి వేయాలని పిటిషన్ దారులకు మార్కెట్ తరలింపు కోసం పలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ తాత్కాలిక నిర్మాణాలు చేసేదాకా రెండు నెలల పాటు గడువు ఇస్తూ, నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత వారికే కేటాయింపు చేయాలన్న షరతులు విదిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో ఉన్న పాత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ లో కొత్త నిర్మాణాల కోసం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4కోట్ల రూపాయలు మంజూరు చేశారు.

ఈ మేరకు దాదాపు 50 మందికి పైగా ఉన్న కూరగాయలవ్యాపారుల కోసం బొక్కల వాగు కట్టపై దాదాపు 40షెడ్ లను తాత్కాలికంగా వెదురు తడకలతో ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎండకు, వానకు, చలికి, కుక్కలు, పందులు, కోతుల నుండి రక్షణ లేకుండా కొత్త మార్కెట్ నిర్మాణం అయ్యే రెండు మూడు ఏండ్ల దాకా వ్యాపారం చేసుకోవడానికి నాలుగున్నర లక్షలతో నాసిరకం సామాగ్రి తో నిర్మాణం చేసి వ్యాపారస్తులను బలవంతంగా తరలించడానికి గాను మంథని మున్సిపల్ రెండు రోజుల నుండి పలు శెట్టర్ల ను ఖాళీ చేయిస్తూ కూల్చి వేతలు మొదలు పెట్టినారు.

అదేవిధంగా గాజులు, పూసలు, ఇతర అలంకరణ సామాగ్రి వ్యాపారులు 15మంది,మసాలా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డల వ్యాపారులు మరో 8మంది ఉండగా వీరికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా ఉన్న షేట్టర్లను ఖాళీ చేయాలని మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేసి, ఆ పక్కనే పునాది స్థాయిలో ఉన్న కట్టడాలను రెండు రోజుల కింద తొలగించి, మిగతా వారికి రెండు రోజుల సమయం ఇస్తూ అల్టీమేటం జారీ చేశారు.త్వరలో కూరగాయల మార్కెట్, ఆతరువాత చికెన్, మటన్ మార్కెట్ తరలించడానికి మున్సిపాలిటీ అన్ని రంగం సిద్ధం చేసుకొన్నారు.

దీనిపై మంథని కూరగాయలు మర్చేంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధం రవీందర్, ఉపాధ్యక్షులు కోరవేనా సతీష్, స్ట్రీట్ వెండర్ ఎడ్ల సాగర్ తదితరులు మంథని మార్కెట్ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు గానీ మా వ్యాపారం గురించి ఎలాంటి జాగ్రత్త లు తీసుకోకుండా చట్ట ప్రకారం మాకు సరియైన సౌకర్యాలతో పునరావాసం కల్పించకుండా, అది కూడా మార్కెట్ కూల్చి వేతకు దాదాపు 7లక్షల రూపాయలకు పైగా నిధులతో ఈ -ప్రోక్యూర్ టెండర్ దాఖలు కోసం ఈనెల 11 నుండి ఈనెల 16వరకు గడవు ఇచ్చి, డెమోలిషన్ టెండర్ అగ్రిమెంట్ కాక ముందే మున్సిపాలిటీ అతి ఉత్సాహంతో మార్కెట్ కూల్చివేత పనులు మొదలు పెట్టడం పై వ్యాపారులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఓవైపు రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు కాగానే మంథని మున్సిపల్ అధికారులు వెజ్ మార్కెట్ కరెంటు కట్ చేయడమే కాకుండా అఘుమేఘాల మీద మంథని మున్సిపల్ కమిషనర్ రాత్రికి రాత్రే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కి ఇంస్ట్రుక్షన్స్ పంపి మార్కెట్ వ్యాపారస్తులకు అన్ని సౌకర్యాలతో తాత్కాలిక షెడ్లు వేసి తరలింపు కొరకు పనులు సిద్ధం చేశామని, గత మూడు నెలలుగా పలు దఫాలుగా వారితో చర్చలు జరిపామని, అందుకు కొందరు అంగీకారం తెలుపారని దాఖలు అయిన రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేయాలని మున్సిపల్ అధికారులు కోరారు.

కాగా ఇట్టి పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేనా రెడ్డి మున్సిపాలిటీ అధికారులు వ్యాపారస్తులకు సరియైన పునరావాసం కల్పించేంత వరకు ఎలాంటి పనులు చేపట్ట రాదనీ, రెండు నెలల్లో వ్యాపారస్తులకు కావాల్సిన సౌకర్యాలతో షెడ్ లు నిర్మాణం చేసిన తర్వాత మాత్రమే వారిని తరలించాలని, ఆ తర్వాత నూతనంగా నిర్మాణం చేసిన మార్కెట్ లో తిరిగి వారికి కేటాయింపు చేయాలని, ఇవన్నీ కూడా తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ చట్టం 2014 మరియు పునరావాస సెక్షన్లు పాటిస్తూ చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.కాగా ఇట్టి పిటిషన్ ను హైకోర్టు న్యాయవాది శ్రీమతి షకీరా బేగం దాఖలు చేయగా హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ పిటిషన్ దారుల తరపున తమ వాదనలు వినిపించారు.