చర్చ, జగిత్యాల : ధనుర్మాసం వేళ అద్దెకు ఆర్టిసి బస్సులు
ధనుర్మాసం వేళ అద్దెకు ఆర్టిసి బస్సులు
ధనుర్మాసం ను పురస్కరించుకొని వివిధ దేవాలయాలకు దర్శనానికి వెళ్లే భక్తులకు అద్దె ప్రాతి పదికాన ఆర్టిసి బస్సులను ఇస్తున్నామని ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల డి. ఎం కే. కల్పన అన్నారు. సోమవారం మీడియా తో మాట్లాడుతూ ధనుర్మాసం ను పురస్కరించుకొని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం పరిపాటి అని ఈ నేపథ్యంలో భక్తులందరు సమిష్టిగా ఆర్టిసి బస్సును అద్దె కు తీసుకొని దర్శనాలను భద్రంగా చేసుకోవచ్చన్నారు. ఆర్టిసి బస్సులను అద్దెకు తీసుకోవాలని భావించే వారికోసం కొత్త బస్టాండ్ లోని ఎంక్వయిరీ నెంబర్ 9493310269 లో సంప్రదించాలని డి. ఎం. కోరారు.