News & Views

చర్చ, కొత్తగూడెం క్రీడలు: రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర బాక్సింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

  • జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్

ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లోని షేక్ పేట్ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న రాష్ట్ర సీనియర్స్ పురుషుల,మహిళల పోటీలకు ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సీనియర్స్ పురుషుల,మహిళల బాక్సింగ్ టీమ్ లను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్,న్యాయవాది యెర్రా కామేష్ తెలిపారు.మంగళవారం జిల్లా బాక్సింగ్ కార్యాలయంలో కామేష్ మాట్లాడుతూ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో సీనియర్ పురుషులు,మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్ర జట్టు ఎంపిక చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బోడా జాన్,ఆర్విన్ వసుమూర్తి,యెర్రా ధనుంజయ్ లను,ఖమ్మం జిల్లా నుండి పోట్లపువ్వు.హరిప్రియలను ఎంపిక చేయడం జరిగిందని,రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారిని ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో జరుగు 9వ ఎలైట్ జాతీయ పురుషుల,మహిళల పోటీలకు తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ వారు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో కోచ్ ఎస్.కే.అర్షద్ తదితరులు పాల్గొన్నారు