చర్చ, రామగిరి: విటిసి లో 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు.
సింగరేణి వ్యాప్తంగా ఈనెల 8 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలను పురస్కరించుకొని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని విటిసి ని భద్రతా తనిఖీ బృందం కన్వీనర్ జి.వి.కోటిరెడ్డి, సభ్యులు పర్యటించారు. వారికి ముందుగా విటిసి అధికారులు, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.
ముఖ్య అతిథిగా అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో తనిఖీ బృందం కన్వీనర్ జి.వి.కోటిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ముందుగా విటిసి శిక్షణ నుంచే భద్రత, క్రమశిక్షణ పై అవగాహణ కల్పించడం జరుగుతుందని, అనుక్షణం భద్రతాతో విధులు నిర్వహించాలని అన్నారు.
తదుపరి అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ విటిసి లో నేర్పినటువంటి భద్రతా నియమాలను పాటిస్తూ, అందరం కలిసికట్టుగా పనిచేస్తూ సింగరేణి సంస్థను ప్రమాద రహిత సంస్థగా తీర్చిదిద్దాలని, గైర్హాజరు కాకుండా విధులు నిర్వహించాలని, బాగా చదువుకున్న వారు అంతర్గత పరీక్షలు రాసి పదోన్నతులు పొందాలన్నారు. అనంతరం తనిఖీ బృందం సంబంధిత రికార్డులను పరిశీలించారు.
కార్యక్రమంలో ఎస్వోటూజియం బండి సత్యనారాయణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జి.శంకర్,
తనిఖీ బృందం సభ్యులు వి.వి.మధుకర్, వి.వెంకటరాజు, మేనేజర్ సుజీత్, డివై ఎస్ఇ ఎ.శ్రీనివాస్, శిక్షకులు యం.వీరన్న, నాగెల్లి సాంబయ్య, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.