చర్చ,గోదావరిఖని: మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు..
మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు..
- శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యం.
- రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిర్వహించేందుకు బారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు.
కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్ లో మూడవ విడత సుల్తానాబాద్, ఎలిగేడు,పెద్దపల్లి, ఓదెల నాలుగు మండలాల్లో 91 గ్రామపంచాయతీలు 852 పోలింగ్ కేంద్రాలలో, 121 పోలింగ్ లొకేషన్స్ ఉన్నట్లు తెలిపారు.
మంచిర్యాల జోన్ పరిధిలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి ఐదు మండలాలలో 102 గ్రామపంచాయతీలు, 868 పోలింగ్ కేంద్రాలలో,128పోలింగ్ లొకేషన్స్ ఉన్నట్లు తెలిపారు. మొత్తం రామగుండం కమిషనరేట్ పరిధి లో 1720 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1167, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు- 563 గుర్తించినట్లు తెలిపారు.
ఎన్నికల విదులలో ఇద్దరు డీసీపీలు,ఏడుగురు ఏసీపీలు, 32 మంది సీఐలు,97 మంది ఎస్‌ఐలు ,270 మంది ఏఎస్‌ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు,520 మంది కానిస్టేబుళ్లు, 240 మంది హోం గార్డులు ,190 మంది ఆర్ముడ్ సిబ్బంది,54 మంది QRT టీమ్స్,57 మంది రూట్ మొబైల్ పార్టీలు,200 ఇతర సిబ్బంది మొత్తం1700 మంది పోలీస్ మరియు భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సున్నితమైన (క్రిటికల్), అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది ఏర్పాటు తోపాటు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌ను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఓటింగ్, కౌంటింగ్ సమయంలో పరిస్థితిలను నిరంతరం గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ, బెదిరింపులు, గొడవలు, అక్రమ మద్యం, డబ్బుల పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు , ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.