News & Views

చర్చ,పెద్దపల్లి: మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం.

 

గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో నాలుగు మండలాల్లో మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల, నాలుగు మండలాల్లో ఎన్నికలు జరగున్న నేపధ్యంలో పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలింపు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయతీలకు గాను 6 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 85 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నిక జరగనుంది. మొత్తం వార్డులు 852 వార్డులకు గాను 215 ఏకగ్రీవం కాగా మిగిలిన 636 వార్డులకు ఎన్నిక జరగనుంది. 300 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా, 1797 మంది వార్డు సభ్యులుగా బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 1 లక్షా 44 వేల 563 మంది ఉండగా ఇందులో పురుషు ఓటర్లు 70 వేల 892 మంది, మహిళా ఓటర్లు 73 వేల 669 మంది గా ఉన్నారు.
పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలించినట్లు ఆర్డీవో గంగయ్య తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ జరగింది, మధ్యాహ్నం 2 నుండి కౌంటింగ్ మొదలుకానుంది. పోలింగ్ కేంద్రాలతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణం పోలింగ్ జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.