News & Views

చర్చ, మంగపేట: యుద్ధ ప్రాతిపదికన మల్లూరు వాగు ప్రాజెక్టు మరమ్మత్తు పనులు ప్రారంభం

 

  • రైతన్నలకు పంట తడికి ఏ ఇబ్బంది కలగొద్దు
  • ఖరీఫ్ వరి సాగు సమయానికి కొత్త తూమ్, సెటర్స్ నిర్మాణం పనులు పూర్తి చేయాలి
  • ఇరిగేషన్ ఈ ఈ సూచనలతో అండర్ వాటర్ డైవర్స్(నీవి )సిబ్బంది తో తాత్కాలిక పనులు పూర్తి చేయించిన మంత్రి సీతక్క

పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మంగపేట మండలం లోని నర్సింహాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోనీ మల్లూరు వాగు ప్రాజెక్టు కుడి కాలువ తూము లింకేజి తెగిపోవడం తో గత కొంత కాలంగా ప్రాజెక్టు కు ఇరువైపులా వున్నా అన్నదాత రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అని స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క స్పందించి పక్కన వున్నా రాష్ట్రం లోని విశాఖపట్నం నుండి ప్రొఫెషనల్ అండర్ వాటర్ డైవర్స్ నలుగురు బృందం తో నిన్న మరమ్మత్తులు చేపట్టాగా యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ అధికారుల సూచనల మేరకు దాదాపు గా పూర్తికానుంది తదుపరి కొత్త తూము కుడా ఏర్పాటు చేసి సెటర్స్ నిర్మాణం కుడా జరుగుతుంది అని స్థానిక నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కాటబోయిన నర్సింహారావ్,మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, మండల వైస్ ప్రెసిడెంట్ గాదె శ్రవణ్,మల్లూరు ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్రంగారి సురేష్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు నరేందర్,గ్రామ ప్రెసిడెంట్  తాతినేని హరికృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు బసరికాని నాగార్జున,అన్నలా వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.