చర్చ, సత్తుపల్లి: ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికలు…
![]()
![]()
ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికలు…
- చర్చ, సత్తుపల్లి:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.నియోజకవర్గం లోని ఐదు మండలాలలో 116 గ్రామపంచాయతీలలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొత్తం 1,83,734 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.116 పంచాయతీలలో 307 మంది అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు.
నియోజకవర్గంలో మొత్తం 130 గ్రామ పంచాయితీలు ఉండగా కోర్టు ఉత్తర్వులతో పెనుబల్లి మండలంలోని ఓ పంచాయతీలో ఎన్నికల నిలిచిపోయాయి.129 గ్రామపంచాయతీలకు గాను 13 పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 116 పంచాయతీలలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగునుంది.పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
